: ఆర్జేడీ చీఫ్ లాలూకు గాయాలు.. ఆస్పత్రికి తరలింపు
రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేరారు. పాట్నాలో ఆయన ఎక్కిన వేదిక కూలడంతో ఒక్కసారిగా కిందపడిపోయారు. దీంతో ఆయనకు గాయాలయ్యాయి. వెంటనే ఆయనను ఇందిరాగాంధీ ఆసుపత్రికి తరలించారు. నడుము భాగంలో నొప్పిగా ఉన్నట్టు ఆయన చెప్పారని చికిత్స అందిస్తున్నట్టు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం లాలూ పరిస్థితి నిలకడగా ఉన్నట్టు పేర్కొన్నారు.