: జగన్‌కు లోకేశ్ సవాల్.. దమ్ముంటే ఆరోపణలు నిరూపించాలన్న చినబాబు
ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఇతరులపై బురదజల్లి పారిపోవడం అలవాటుగా మారిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. అసెంబ్లీలో విలువైన సమయాన్ని ఆయన వృథా చేస్తున్నారని మండిపడ్డారు. జగన్‌కు దమ్ముంటే తనపై చేస్తున్న ఆరోపణలను నిరూపించాలని సవాలు విసిరారు. సభాసమయాన్ని వృథా చేస్తున్న జగన్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తాను రాజకీయాల్లోకి వచ్చింది ప్రజా సేవ చేసేందుకేనని స్పష్టం చేశారు. తనపై జగన్ చీటికిమాటికి చేస్తున్న ఆరోపణలను నిరూపించాలని లోకేశ్ డిమాండ్ చేశారు.