: దలైలామాను కలిశాము...ప్రశాంతంగా నిద్ర పోతాను: స్టీవ్ స్మిత్
బోర్డర్ అండ్ గవాస్కర్ టోర్నీలో చివరిదైన నాలుగో టెస్టు ఆడేందుకు భారత్, ఆస్ట్రేలియా జట్లు హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాలకు చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా ఆటగాళ్లు అక్కడ ఆశ్రయం పొందుతున్న బౌద్ధుల ఆధ్యాత్మిక గురువు దలైలామాను కలిశారు. దలైలామా ఆశ్రమానికి వెళ్లిన ఆసీస్ ఆటగాళ్లు ఆయనతో ముచ్చటించారు. దీనిపై సోషల్ మీడియాలో తన పేజ్ లో ఆసీస్ కెప్టెన్ స్మిత్ ‘చాలా సంతోషంగా ఉంది. నిద్ర గురించి అడిగాను. నేను ప్రశాంతంగా నిద్రపోయేందుకు ఏమైనా సాయం చేయగలరా? అని ప్రశ్నించాను. ఆశీస్సులు కోరాను. మేమిద్దరం మా ముక్కులు రాసుకొన్నాం. ఆయన నాకు ఆశీస్సులు అందించారు. ఈ ఐదు రోజులు ప్రశాంతంగా నిద్ర పడుతుందని ఆశిస్తున్నా’ అని పేర్కొన్నాడు. కాగా, 2013లో ఇంగ్లాండ్ జట్టు ఆశ్రమాన్ని సందర్శించినా లామాను కలవలేకపోవడం విశేషం.