: తమిళనాడు జ్యువెలరీ షాపులో 60 కిలోల బంగారం చోరీ
ఓ ఆభరణాల దుకాణంలోకి చొరబడిన దుండగులు కోట్ల రూపాయలు విలువచేసే బంగారాన్ని చోరీ చేసిన ఘటన తమిళనాడులోని తిరునల్వేలీ జిల్లా పలయమ్‌కొట్టాయ్‌లో చోటుచేసుకుంది. నిన్న రాత్రి జరిగిన ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ భారీ చోరీపై పోలీసులు వివరాలు తెలుపుతూ దుండగులు మొత్తం 60 కిలోల బంగారాన్ని ఎత్తుకెళ్లారని అన్నారు. దుండగులు మేడ పైనుంచి దుకాణంలోకి చొరబడ్డారని, గ్రిల్‌ను తెరవడానికి గ్యాస్ కట్టర్‌ను ఉపయోగించారని పోలీసులు గుర్తించారు. చోరీ జరుగుతున్న సమయంలో దుకాణం ముందు ఇద్దరు భద్రతా సిబ్బంది ఉన్నారని పోలీసులు చెప్పారు. ఈ కేసులో ఆ దుకాణ ఉద్యోగులను కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నారు.