: కోహ్లీ, జహీర్!...పెళ్లి చేసుకోండయ్యా బాబూ! : హర్భజన్ సలహా


టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, మాజీ పేసర్ జహీర్ ఖాన్ లను పెళ్లి చేసుకోవాలని వారి మాజీ సహచర క్రికెటర్ హర్భజన్ సింగ్ సూచించాడు. ఓ వెబ్ సైట్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన హర్భజన్ సింగ్.. ఎంజాయ్ చేసింది ఇక చాలని, పెళ్లిళ్లు చేసుకోవాలని సూచించాడు. రిలేషన్ షిప్ లో ఉన్న తన సహచరులు పెళ్లి చేసుకుని సెటిలైతే బాగుంటుందని, తాను చాలా ఆనందపడతానని భజ్జీ చెప్పాడు.

కాగా, కోహ్లీ బాలీవుడ్ నటి అనుష్క శర్మతో ప్రేమలో ఉండగా, జహీర్ ఖాన్ చక్ దే ఇండియా సినిమా ఫేమ సాగరిక ఘట్గేతో ప్రేమలో ఉన్నాడని కథనాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యలో భజ్జీ ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం. వివాహంపై నిర్ణయం తీసుకోవాల్సింది వారే అయినప్పటికీ...వారు సెటిలవ్వడం తనను ఆనందానికి గురి చేస్తుందని చెప్పాడు. జహీర్ ఖాన్ అయితే ఇక అస్సలు ఆలస్యం చేయకూడదని, కనీసం ఈ ఏడాది అయినా వివాహం చేసుకుని సెటిల్ అవ్వాలని సూచించాడు. 

  • Loading...

More Telugu News