: ధర్మశాలలో దలైలామా బోధనలు విన్న ఆస్ట్రేలియా క్రికెటర్లు!
ధర్మశాల వేదికగా టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య జరగనున్న చివరి టెస్టు మ్యాచు ఆడడానికి అక్కడికి చేరుకున్న ఆసీస్ ఆటగాళ్లు ఈ రోజు బౌద్ధమత గురువు దలైలామాను కలిశారు. దలైలామా ముందు కూర్చొని ఆయన చేస్తోన్న బోధనలను వారు విన్నారు. దలైలామాను కలిసిన వారిలో ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్, ఓపెనర్ డేవిడ్ వార్నర్, స్పిన్నర్ నేతన్ లయన్, ఇతర టీమ్ సభ్యులు ఉన్నారు.
నాలుగు టెస్టు మ్యాచుల సిరీస్‌లో మొదటి టెస్టులో ఆస్ట్రేలియా గెలిస్తే, రెండో టెస్టులో టీమిండియా గెలిచింది. మూడో టెస్టు డ్రా కావడంతో ఫలితాన్ని తేల్చే చివరి టెస్టు మ్యాచు కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. రేపటి నుంచి ఈ టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది.