: అమెరికాలో తెలుగువారి హత్యలో కొత్త కోణం... తల్లీ బిడ్డలను హత్య చేసింది హనుమంతరావేనని ఆరోపణలు!


నిన్న అమెరికాలో హత్యకు గురైన నర్రా హనుమంతరావు భార్య శశికళ, కుమారుడు అనీష్ కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. తమ కుమార్తె, మనవడిని హనుమంతరావే హత్య చేశాడని శశికళ తల్లిదండ్రులు వెంకటేశ్వరరావు, కృష్ణకుమారి ఆరోపించారు. ఇదే విషయాన్ని అమెరికా అధికారులకు తాము ఫిర్యాదు చేశామని పేర్కొన్నారు. హనుమంతరావుకు అమెరికాలో వివాహేతర సంబంధాలున్నాయని, తనను వేధిస్తున్నట్టు తన కుమార్తె చెబుతుండేదని కొద్దిసేపటి క్రితం ఆయన ఓ టీవీ చానల్ తో మాట్లాడుతూ ఆరోపించారు. హనుమంతరావు వేధింపులపై తన వియ్యంకుడికి ఎన్నో మార్లు చెప్పినా, వారు పట్టించుకోలేదని చెప్పుకొచ్చారు. శశికళతో పాటు అనీష్ ను తానే చంపి ఇప్పుడిలా నాటకం ఆడుతున్నాడని వెంకటేశ్వరరావు ఆరోపించారు.

  • Loading...

More Telugu News