: 'బయటకు రారా తేల్చుకుందాం'... అసెంబ్లీలో కొట్టుకునేంత పని చేసిన టీడీపీ, వైసీపీ ఎమ్మెల్యేలు
ఏపీ అసెంబ్లీ సవాళ్లు, ప్రతి సవాళ్లతో గందరగోళంగా కొనసాగుతోంది. అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ క్రమంలో, ఒకానొక సమయంలో ఇరు పార్టీల సభ్యులు అదుపు తప్పారు. స్పీకర్ పోడియం వద్ద ఘర్ణణ వాతావరణం నెలకొంది. పరిస్థితి కొట్టుకునేంత వరకు వెళ్లింది. అర్థం పర్థం లేకుండా గొడవ చేస్తున్నారంటూ వైసీపీ సభ్యులపై టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా, టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని, వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిల మధ్య మాటల యుద్ధం జరిగింది. ఇద్దరు కూడా 'బయటకు రారా తేల్చుకుందాం' అంటూ ఆగ్రహావేశాలకు లోనయ్యారు. ఈ నేపథ్యంలో, చెవిరెడ్డికి మద్దతుగా ఆపార్టీ ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి వెళ్లారు. చింతమనేనికి అండగా వల్లభనేని వంశీ, ప్రభాకర్ చౌదరిలు నిలిచారు.