: ముంబై నుంచి వస్తున్న హీరోయిన్లకు ఇకపై ఇబ్బందులే!


దక్షిణాదిన అందమైన ముఖం, మంచి శరీరాకృతి, నటించగల టాలెంట్ ఉన్న ఎంతో మంది అమ్మాయిలు ఉన్నప్పటికీ... ఉత్తరాది భామల వెంట పడుతుంటారు మన దక్షిణాది సినీ పెద్దలు. అందులోనూ ముంబై ముద్దుగుమ్మలంటే మన వాళ్లకు మరింత క్రేజ్. కోరి తెచ్చుకున్న తర్వాత వారి గొంతెమ్మ కోర్కెలను తీర్చక తప్పదు కదా. దీంతో, వీరికి ఖర్చు కూడా తడిసి మోపెడవుతోంది.

ఇకపై ఇలాంటివి కొనసాగనివ్వమని దక్షిణ భారత సినీ కార్మికుల సమ్మేళనం (ఫెఫ్సీ) స్పష్టం చేసంది. ఈ మధ్యనే ఆర్కే సెల్వమణి అధ్యక్షతన ఫెఫ్సీ కొత్త కార్యవర్గం కొలువైంది. ఈ కార్యవర్గం చేసిన పలు తీర్మానాల్లో... ముంబై భామల గొంతెమ్మ కోరికలకు చెక్ చెప్పడం కూడా ఉంది. ముంబై నుంచి వచ్చే హీరోయిన్లు ముంబై నుంచే తమ పర్సనల్ మేకప్, కాస్ట్యూమ్స్ డిజైనర్లను తెచ్చుకోవడం పరిపాటిగా మారింది. ఇకపై ఇలాంటి వాటిని అంగీకరించబోమని, ఫెఫ్సీలో ఉన్న టెక్నీషియన్లనే వాడుకోవాలని ఓ తీర్మానం చేశారు.

  • Loading...

More Telugu News