: జగన్ కు బుర్ర పనిచేయడం లేదని అనుకున్నా... అది తప్పు: అచ్చెన్నాయుడు


ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ కు బుర్ర పని చేయడం లేదని ఇంతకాలమూ అనుకుంటూ వచ్చానని, ఈ విషయంలో తాను తప్పుడు అభిప్రాయంతో ఇన్నాళ్లూ ఉన్నానని, నేడు అసెంబ్లీలో ఆయన వైఖరి చూస్తుంటే, అసలు బుర్రే లేదని అర్థమైందని మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించడంతో ఏపీ అసెంబ్లీలో మరోసారి రభస మొదలైంది. ఈ ఉదయం పది నిమిషాల పాటు వాయిదా పడ్డ అసెంబ్లీ, తిరిగి సమావేశం కాగానే, ఓటుకు నోటు కేసులో తామిచ్చిన వాయిదా తీర్మానాన్ని చర్చకు అనుమతించాలని వైకాపా పట్టుబట్టింది.

ఆ పార్టీ సభ్యులు వెల్ లోకి దూసుకొచ్చి నినాదాలు చేస్తుండటంతో, పలువురు తెలుగుదేశం సభ్యులు వైకాపా వైఖరికి నిరసన తెలుపుతూ ప్రతి నినాదాలు చేశారు. ఈ కేసు ఓ పనికిమాలినదని అన్నారు. దీనిపై చర్చే అవసరం లేదని తేల్చారు. తమపై అధికారపక్షం వ్యక్తిగత దూషణలకు దిగుతున్నా స్పీకర్ చూస్తూ మిన్నకుంటున్నారని వైకాపా సభ్యుడు చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఆరోపించారు.

  • Loading...

More Telugu News