: కాసేపట్లో గుంటూరు మిర్చి యార్డు రైతులను కలవనున్న జగన్!
వైఎస్సార్సీపీ అధినేత జగన్ కాసేపట్లో గుంటూరు మిర్చి యార్డులో రైతులను కలవనున్నారు. మిర్చి ధరలు పడిపోయాయి. నెల క్రితం మిర్చి క్వింటాల్ ధర రూ.12 వేలు ఉండగా, ప్రస్తుత ధర రూ.4,500గా ఉంది. రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మిర్చికి గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రైతులతో జగన్ భేటీ కానున్నారు. మిర్చి ధరల పతనంపై వారితో మాట్లాడనున్నారు.