: కోహ్లీని ట్రంప్‌తో పోల్చడంపై ఆస్ట్రేలియా మీడియాకు చురకలంటించిన యువరాజ్ సింగ్


భార‌త్‌, ఆస్ట్రేలియా జ‌ట్ల మ‌ధ్య‌ బెంగళూరులో జ‌రిగిన టెస్టు మ్యాచులో ఏర్పడిన ‘స్మిత్ డీఆర్ఎస్ వివాదం’ నేపథ్యంలో ఆస్ట్రేలియా మీడియా టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీని డొనాల్డ్‌ ట్రంప్‌తో పోల్చిన విష‌యం తెలిసిందే. ఆ దేశ మీడియా తీరుపై టీమిండియా క్రికెట‌ర్ యువ‌రాజ్ సింగ్ స్పందిస్తూ చుర‌క‌లు అంటించాడు. అస‌లు అలా పోల్చడం కోహ్లీకి పెద్ద ప్రశంస లాంటిదని పేర్కొన్నాడు. అలా పేర్కొన‌డం ద్వారా ఆసీస్ మీడియా కోహ్లీ అత్యుత్తమం అని చెప్పింద‌ని అన్నాడు.  

ఇదే అంశంపై ఇటీవ‌లే  బాలీవుడ్‌ దిగ్గ‌జ న‌టుడు అమితాబ్ బ‌చ్చ‌న్ కూడా స్పందిస్తూ..  ట్రంప్ గెలిచాడని, అమెరికా ప్రెసిడెంట్‌గా ఎంపికయ్యాడని అన్నారు. దీంతో కోహ్లీ విజేతే అని ఆ మీడియా అంగీకరించింద‌ని చుర‌క‌లు అంటించిన విష‌యం తెలిసిందే.


  • Loading...

More Telugu News