: చెన్నయ్ షూటింగులో మహేశ్.. భార్యా పిల్లలు కూడా అక్కడికే!
మహేష్ బాబు హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం షూటింగ్ ప్రస్తుతం చెన్నైలో జరుగుతోంది. వరుస షెడ్యూళ్లతో షూటింగ్ జరుగుతుండటంతో మహేశ్ బాబు చాలా బిజీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో మహేష్ ను కలిసేందుకు భార్య నమ్రత, పిల్లలు గౌతమ్, సితార చెన్నైకు చేరుకున్నారు. ఈ సందర్భంగా చెన్నై ఎయిర్ పోర్టులో తన పిల్లలతో కలిసి దిగిన ఓ సెల్ఫీని నమ్రత తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది.‘ మై లైఫ్ లైన్స్.. హలో చెన్నై.. ప్రియమైన నాన్నను కలిసేందుకు ఆగలేకపోతున్నారు’ అని తన పోస్ట్ లో నమ్రత పేర్కొంది. అయితే, ఇదే ఫొటోను మహేష్ తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేసి..‘ల్యాండెడ్..’ అని పేర్కొన్నాడు.