: ట్విట్టర్ లో మరో అద్భుత ఫీచర్!
ఫేస్‌బుక్‌లో ప్రవేశపెట్టిన లైవ్ వీడియో స్ట్రీమింగ్ సదుపాయం యూజర్లను ఎంతగానో ఆకర్షిస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పుడు తమ సైట్లో కూడా ఆ సదుపాయాన్ని తీసుకొచ్చినట్లు ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజ సంస్థ ట్విట్టర్ తెలిపింది. ట్విట్టర్‌లో ఇంతవరకు పెరీస్కోప్ ద్వారా ప్రత్యక్ష ప్రసారాల సౌకర్యం ఉన్న విషయం తెలిసిందే. అయితే, తాము తీసుకొచ్చిన ప్రత్యేక ఫీచర్‌తో ఇకపై వీడియోలను ప్రాథమికంగా ఎడిట్ చేసుకునే వీలు కూడా ఉంటుందని తెలిపింది. స్పోర్ట్స్, బహిరంగ సభలు వంటివాటిని ట్విట్టర్‌లో ప్రత్యక్ష ప్రసారం చేసుకోవచ్చని పేర్కొంది.