: వైద్యుల నిర్లక్ష్యం.. రహదారిపైనే ప్రసవించిన మహిళ!
తూర్పు గోదావరి జిల్లా ఎటపాక మండలం మురుమూరులో ఓ గర్భిణి పట్ల వైద్యులు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించారు. నిండు గర్భిణి అయిన ఓ మహిళ గౌరీదేవి పేట పీహెచ్‌సీ ఆసుపత్రిలో కాన్పుకోసం వచ్చింది. ఆమెను పరీక్షించిన వైద్యులు ప్రసవానికి ఇంకా చాలా సమయం ఉందని చెప్పి, ఆసుపత్రి నుంచి వెనక్కు పంపించారు. దీంతో తిరిగి వెళ్లిపోయిన కొద్ది సేపటికే రహదారిపైనే తీవ్ర నొప్పులతో బాధపడుతూ ఆమె ప్రసవించింది. అనంతరం ఆమెను ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది. వైద్యుల నిర్లక్ష్యంపై ఆమె కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై మరింత సమాచారం అందాల్సి ఉంది.