: యూపీ మంత్రి చీపురు పట్టారు.. పరిసరాలు శుభ్రం చేశారు!
యూపీ కేబినెట్ మంత్రి ఉపేంద్ర తివారీ తన కార్యాలయాన్ని, పరిసరాలను ఆయనే స్వయంగా శుభ్రం చేశారు. ఈ రోజు ఆయన తన కార్యాలయానికి వెళ్తుండగా పరిసరాలు చెత్తతో నిండి ఉండటాన్ని గమనించారు. సంబంధిత సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన, స్వయంగా చీపురు తీసుకుని తన కార్యాలయాన్ని, కారిడార్ ను శుభ్రం చేయడంతో అక్కడ ఉన్న అధికారులు ఆశ్చర్యపోయారు.
కాగా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత తన కేబినెట్ మంత్రులను కార్యాలయాలు, పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని ఆదేశించారు. పరిశుభ్రత నిమిత్తం ఏడాదిలో వంద గంటలు కేటాయించాలని కేబినెట్ మంత్రులతో ఇటీవల ప్రతిజ్ఞ చేయించారు. ఈ నేపథ్యంలో ఉపేంద్ర తివారీ స్వయంగా చీపురు పట్టుకున్నారు.