: 'రెండాకులు' ఎవరికీ ఇవ్వం..: శశికళ, పన్నీరు సెల్వంలకు షాకిచ్చిన ఎన్నికల సంఘం


అన్నాడీఎంకే పార్టీ తమదంటే తమదంటూ పోట్లాడుకుంటున్న శశికళ, పన్నీరు సెల్వం వర్గాలకు కేంద్ర ఎన్నిక సంఘం షాక్ ఇచ్చింది. అన్నాడీఎంకే పార్టీకి చెందిన రెండాకుల గుర్తు తమదేనంటూ, తమకే కేటాయించాలంటూ శశికళ, పన్నీరు సెల్వం వర్గాలు జాతీయ ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. రెండు వర్గాల వాదనలు విన్న జాతీయ ఎన్నికల సంఘం ఈ గుర్తును బ్లాక్ చేస్తున్నట్టు చెప్పింది. రెండాకుల గుర్తును పక్కనపెట్టి ఇతర గుర్తులు ఎంచుకోవాలని ఈ రెండు వర్గాలకు సూచించింది. నేటి ఉదయం పది గంటలలోపు కొత్త గుర్తుపై నిర్ణయం తీసుకోవాలని రెండు వర్గాలకు సూచించింది. దీంతో దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్తామని శశికళ వర్గం తెలిపింది. 

  • Loading...

More Telugu News