: మాఫియా డాన్ దావూద్ కీలక అనుచరుడి అరెస్ట్


అండర్ వరల్డ్ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంకు కీలక అనుచరుడు దావూద్ లాలాను గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్) అరెస్టు చేసింది. అహ్మదాబాద్ లోని జుహాపురా ప్రాంతంలో అతన్ని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. గుజరాత్ లో ఓ హత్య కేసుకు సంబంధించి దావూద్ లాలా కోసం ఏటీఎస్ గాలిస్తోంది. దావూద్ ఇబ్రహీంకు ఎంతో సన్నిహితంగా ఉండే షరీఫ్ ఖాన్ కు లాలా బంధువు అని, లాలా అరెస్టుతో అతని ముగ్గురు సోదరులు కనిపించకుండా పోయినట్లు తెలుస్తోంది. దీంతో, ఆ ముగ్గురి సోదరుల కోసం ఏటీఎస్ గాలిస్తోంది. కాగా, రాజస్థాన్, గుజరాత్ లలో ఉన్న దావూద్ గ్యాంగ్ లన్నింటినీ లాలానే నడిపిస్తున్నాడనే సమాచారం ఏటీఎస్ వద్ద ఉన్నట్లు తెలుస్తోంది. కేవలం రాజస్థాన్ లోనే అతనిపై 15 కేసులు నమోదై ఉన్నాయి. 

  • Loading...

More Telugu News