: ప్రతిపక్షాల మాటలను ప్రజల కోసమే భరించాను: సీఎం చంద్రబాబు


ప్రతిపక్షాలు తనను అనరాని మాటలన్నప్పటికీ, కేవలం ప్రజల కోసమే ఆ మాటలను భరించానని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ రోజు అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ,‘ఆ మధ్య కాలంలో మీరు చూశారు అధ్యక్షా ! ఎంత బాధేస్తుందంటే.. నన్ను.. చెప్పుకో కూడదు కానీ, నన్ను అనరాని భాషలో.. దేంతో కొట్టమన్నారో కూడా మీరూ విన్నారు. నా నోటి గుండా చెప్పలేకపోతున్నాను. మామూలుగా, ఆ మాట ఒక ఎమ్మెల్యేను కామన్ మ్యాన్ కూడా అనలేడు. లేదంటే, కామన్ మ్యాన్ ని కామన్ మ్యాన్ కూడా అనలేడు. ఎవరికైనా రోషం ఉంటుంది.  మనకు కూడా రక్తం, మాంసం... ఒక ఆలోచన, ఒక విధానం, జీవితం ఇవన్నీ ఉన్నాయి. కానీ, ఆ మాటలను భరించాను. ఎందుకు భరించానంటే.. ప్రజల కోసమే’ అని చంద్రబాబు అన్నారు. 

  • Loading...

More Telugu News