: 31 రోజుల్లో సినిమా పూర్తి చేసిన హిట్ సినిమాల దర్శకుడు!


ఈ రోజుల్లో నెల రోజుల్లో ఓ సినిమా పూర్తి చేయడం అంటే మాటలు కాదు. ఆ ఘనతను ఓ టాలీవుడ్ దర్శకుడు సాధించాడు. 'అష్టా చమ్మా', 'గోల్కొండ హైస్కూల్', 'అంతకు ముందు ఆ తరువాత', 'జెంటిల్మన్' వంటి సినిమాలతో హిట్లు కొట్టిన దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ కేవలం 31 రోజుల్లో ఒక సినిమాను పూర్తి చేశాడు. నానితో రూపొందించిన 'జెంటిల్మన్' సినిమా విజయంతో నాగచైతన్యతో సినిమా చేయాలని భావించాడు. అయితే డేట్స్ కారణంగా నాగచైతన్య కొంత సమయం అడిగాడు. ఈ సమయంలో ఖాళీగా ఉండడం ఎందుకు? అని భావించిన ఇంద్రగంటి... తనకు సన్నిహితుడైన అవసరాల శ్రీనివాస్, అడవి శేష్, వెన్నెల కిశోర్ ప్రధాన పాత్రల్లో 'అమీ తుమీ' అనే సినిమాను పూర్తి చేశాడు.

ఈ చిత్రాన్ని కేవలం 31 రోజుల్లో పూర్తి చేసేందుకు సహకరించిన నటులు, టెక్నీషియన్లకు ఇంద్రగంటి తన సోషల్ మీడియా పేజ్ ద్వారా ధన్యవాదాలు తెలిపాడు. గ్రీన్ టీ ప్రొడక్షన్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ సినిమాలో అవసరాల, అడివి శేష్ సరసన ఈషా, అదితి మాయకల్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందించడం విశేషం. 

  • Loading...

More Telugu News