: సల్మాన్ ఖాన్, ఐశ్వర్యరాయ్ లు విడిపోవడానికి ఇతనే కారణమట!
బాలీవుడ్ స్టార్లు సల్మాన్ ఖాన్, ఐశ్వర్యారాయ్ లు ప్రేమలో మునిగి తేలిన సంగతి తెలిసిందే. కొంత కాలం తర్వాత వీరిద్దరూ విడిపోయారు. ఇద్దరి మధ్య తలెత్తిన విభేదాల కారణంగానే వీరు విడిపోయారని చాలా మంది భావించారు. వీరు ప్రేమలో మునిగి తేలుతున్న సమయంలో కూడా... ఐష్ పై సల్మాన్ పలుమార్లు చేయిచేసుకున్నాడని వార్తలు కూడా వెలువడ్డాయి.
అయితే, వీరిద్దరూ విడిపోవడానికి కారణం ఐశ్వర్య తండ్రి కృష్ణరాజ్ అట! సల్మాన్ కి కోపం ఎక్కువని... అతడిని పెళ్లి చేసుకుంటే నీ జీవితం పాడైపోతుందని... జీవితంలో అతనితో మాట్లాడవద్దని ఐష్ ని ఆమె తండ్రి హెచ్చరించాడట. ఇదే విషయంపై సల్మాన్ ఓ ఇంటర్వ్యూలో స్పందించాడు. ఐశ్వర్య తండ్రి తన గురించి అనుకున్నది నిజమేనని... తనకు నిజంగానే కోపం ఎక్కువని చెప్పాడు.