: 67 స్థానాల్లోనే ఎందుకు? అన్ని స్థానాల్లోనూ ఎన్నికలు నిర్వహించమనండి!: మీడియా ప్రశ్నకు జగన్ ఘాటు సమాధానం
ఏపీ అసెంబ్లీ ఈ రోజు వాయిదా పడిన అనంతరం మీడియాతో వైఎస్సార్సీపీ అధినేత జగన్ మాట్లాడారు. ‘వైఎస్సార్సీపీ గెలిచిన 67 స్థానాల్లో మాత్రమే ఎన్నికలు నిర్వహిద్దామని సీఎం చంద్రబాబు అంటున్నారు..’ అని ఓ విలేకరి ప్రశ్నించగా.. దీనికి జగన్ స్పందిస్తూ, ‘67 స్థానాల్లోనే ఎందుకు? చంద్రబాబుకు దమ్మూధైర్యం ఉంటే మొత్తం 175 స్థానాల్లో ఎన్నికలు నిర్వహించమనండి. మేం సిద్ధంగా ఉన్నాం. కమాన్ రమ్మనండి..మేం రెడీ' అని జగన్ ఘాటుగా స్పందించారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయమై జూన్ వరకు ఎదురుచూస్తామని, ఆ తర్వాత తమ పోరాటం మరింత ఉద్ధృతం చేస్తామని, తాము చేసే పోరాటంపై దేశ వ్యాప్తంగా చర్చ జరగాలన్నదే తమ ఉద్దేశం అని, దేశాన్ని జాగృతం చేస్తామని జగన్ అన్నారు.