: కోహ్లీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆసీస్ మీడియాకు చురకలంటించిన అమితాబ్


ఇటీవ‌ల బెంగ‌ళూరులో భార‌త్‌, ఆస్ట్రేలియా జ‌ట్ల మ‌ధ్య‌ జ‌రిగిన రెండో టెస్టు మ్యాచులో చెల‌రేగిన స్మిత్ డీఆర్ఎస్ వివాదం నేప‌థ్యంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై ఆస్ట్రేలియా మీడియా ప‌లు అనుచిత వ్యాఖ్య‌లు చేసిన విష‌యం తెలిసిందే. ఓ ఆస్ట్రేలియా మీడియా కోహ్లీని జంతువులతో పోల్చితే, మరో వార్తా ప‌త్రిక అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో పోల్చింది. అయితే, ఆస్ట్రేలియా మీడియా తీరుపై బాలీవుడ్‌ దిగ్గ‌జ న‌టుడు అమితాబ్ బ‌చ్చ‌న్ స్పందిస్తూ చుర‌క‌లు అంటించారు. ఆసీస్ మీడియా కోహ్లీని డొనాల్డ్‌ ట్రంప్‌తో పోలుస్తోందని త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పేర్కొన్న అమితాబ్‌.. ట్రంప్ గెలిచాడని, అమెరికా ప్రెసిడెంట్‌గా ఎంపికయ్యాడని అన్నారు. దీంతో కోహ్లీ విజేతే అని ఆ మీడియా అంగీకరించింద‌ని చుర‌క‌లు అంటించారు. చివ‌రికి 'థ్యాంక్యూ ఆసీస్ మీడియా' అని పేర్కొన్నారు.


  • Loading...

More Telugu News