: కొత్త రాజకీయ పార్టీ పెట్టనున్న తమిళ సినీ దర్శకుడు
తమిళనాడులో ఇప్పటికే ఎన్నో రాజకీయ పార్టీలు ఉన్నాయి. తాజాగా, ఇప్పుడు ఆ రాష్ట్రంలో రాజకీయ శూన్యత నెలకొని ఉండటంతో... పలువురు ప్రముఖులు రాజకీయాల్లోకి రావడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో, పలు కొత్త పార్టీలు పెట్టుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. తమిళ సినీ పరిశ్రమలో నటుడిగా, దర్శకుడిగా, ఛాయాగ్రాహకుడిగా, కథా రచయితగా మంచి పేరు ఉన్న తంగర్ బచ్చన్ తాను కొత్త పార్టీని నెలకొల్పుతున్నట్టు ప్రకటించాడు. తమిళ ప్రజల శ్రేయస్సు కోసమే తాను పార్టీని పెట్టబోతున్నట్టు తెలిపారు.