: స్పీకర్ పై చర్యలు తీసుకోవాలని ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేశా!: రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలనకు స్వస్తి చెప్పి రాజకీయ కక్ష సాధిస్తున్నారని టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసిన అనంతరం ఆయన మాట్లాడుతూ, పార్టీ ఫిరాయింపుదారులపై స్పీకర్ కు ఫిర్యాదు చేస్తే, వారిపై చర్యలు తీసుకోకపోగా పార్టీని విలీనం చేసినట్లు స్పీకర్ బులెటిన్ విడుదల చేశారని మండిపడ్డారు. రాజకీయ పార్టీల విలీనం ఎన్నికల సంఘం పరిధిలోని అంశమని చెప్పిన ఆయన, దీనిపై స్పీకర్ పై చర్యలు తీసుకోవాలని ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేశామని చెప్పారు. దీనితోపాటు నియోజకవర్గాల పునర్విభజన చట్టం, రాష్ట్రపతి ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటు చేశారని ఆయన ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల కారణంగా ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.