: సజ్జన్ కు ఉరిశిక్ష పడేలా చేస్తే 5.5కోట్ల బహుమానం!
1984నాటి సిక్కు అల్లర్ల కేసులో కాంగ్రెస్ నేత సజ్జన్ కుమార్ ను ఉరికంబం ఎక్కేలా చేస్తే వారికి ఐదున్నర కోట్ల రూపాయల బహుమానం ఇస్తామని అమెరికాలోని సిక్కుల హక్కుల ఉద్యమ సంస్థ ప్రకటించింది. నాటి అల్లర్లలో దుండగులను ప్రేరేపించి పలువురి మరణానికి కారకుడైన సజ్జన్ కుమార్, ఇతర కాంగ్రెస్ నేతల నేరాలను న్యాయస్థానం ముందు నిరూపించేలా సాక్ష్యాలను అందించిన వారికి లేదా సాక్ష్యం చెప్పినవారికి ఈ బహుమానం ఇస్తామని తెలిపింది. సజ్జన్ ను నిర్దోషిగా ఢిల్లీ కోర్టు తీర్పు చెప్పడంతో ఈ సంస్థ ఈ ప్రతిపాదనతో ముందుకొచ్చింది.