: పదవ తరగతి పరీక్షల్లో కాపీ కొడుతూ దొరికిపోయిన విద్యార్థి.. భవనం పై నుంచి దూకేసిన వైనం!
పదవ తరగతి పరీక్షల్లో కాపీ కొడుతూ దొరికి పోయిన ఓ విద్యార్థి అనంతరం భవనం పై నుంచి దూకేసిన ఘటన హైదరాబాద్లోని కంచన్ బాగ్లో చోటుచేసుకుంది. కంచన్ బాగ్లోని ఓ స్కూల్లో సన్నీత్రెడ్డి (15) అనే విద్యార్థి ఈ రోజు పదవ తరగతి పరీక్షకు హాజరయ్యాడు. అయితే, పరీక్ష హాలులో కాపీకొడుతూ ఇన్విజిలేటర్కి దొరికిపోవడంతో ఆ విద్యార్థిని పరీక్ష హాలు నుంచి బయటకు పంపించారు. దీంతో గది బయటకు వచ్చిన సన్నీత్ మూడో అంతస్తు కారిడార్ నుంచి కిందకు దూకేశాడు. దీనిని గమనించిన పాఠశాల సిబ్బంది ఆ బాలుడిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆ విద్యార్థి పరిస్థితి మెరుగ్గా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు పాఠశాలలోని సీసీ టీవీ పుటేజీలను పరిశీలిస్తున్నారు.