: పంజాబ్ సీఎం సంచలన నిర్ణయం... ప్రజాప్రతినిధులకు షాక్!
పంజాబ్ కొత్త ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ఎమ్మల్యేలు, ఎంపీలకు బుగ్గకార్లు ఉండవంటూ ఆయన ప్రకటించారు. వీరి కార్లపై బుగ్గలు ఉండబోవని చెప్పారు. అమరీందర్ నిర్ణయాన్ని ప్రజలంతా హర్షిస్తున్నారు. ఇదే సమయంలో ఎమ్మల్యేలు, ఎంపీలు మాత్రం ఇదెక్కడి నిర్ణయంరా నాయనా? అని బాధపడుతున్నారు. బుగ్గ కార్లలో తిరగడాన్ని ప్రజాప్రతినిధులు ఓ అధికారదర్పంగా భావిస్తుండం తెలిసిందే. బుగ్గకార్లు ప్రజాప్రతినిధులకు ఆనందాన్ని కలిగించినా... సామాన్య ప్రజానీకానికి మాత్రం వాటి శబ్దం చికాకును తెప్పిస్తుంటుంది. ఈ నేపథ్యంలో, అమరీందర్ నిర్ణయాన్ని ఇతర ముఖ్యమంత్రులు కూడా ఆచరిస్తే అందరికీ బాగుంటుందేమో.