: రూ. 43 వేల కోట్లంటున్నారు... పది శాతం ఇవ్వండి, ఎక్కడ కావాలంటే అక్కడ సంతకం పెడతా: టీడీపీకి జగన్ సవాల్


తన వద్ద రూ. 43 వేల కోట్ల విలువైన అక్రమాస్తులు ఉన్నాయని ఆరోపించిన తెలుగుదేశం పార్టీ సభ్యులకు వైకాపా అధినేత జగన్ ఓ సవాల్ విసిరారు. జగన్ కు ఐదేళ్లలో ఇంత భారీమొత్తంలో ఆస్తులు ఎలా సమకూరాయని మంత్రి అచ్చెన్నాయుడు ప్రశ్నించిన వేళ, జగన్ మాట్లాడుతూ, తన వద్ద రూ. 43 వేల కోట్ల ఆస్తులు ఉన్నాయని అంటున్న తెలుగుదేశం పార్టీ, అందులో పది శాతం మొత్తాన్ని తనకు ఇస్తే, ఎక్కడ కావాలంటే అక్కడ సంతకం పెట్టేందుకు సిద్ధమని అన్నారు. కావాలనే తనను కేసుల్లో ఇరికించారని ఆరోపించిన ఆయన, తన సంపాదనంతా చట్టబద్ధమేనని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News