: మమ్మల్ని కుక్కలు అంటే... మేం పందులు అనకూడదా?: అసెంబ్లీలో కొడాలి నాని
ఏపీ అసెంబ్లీలో జగన్ ఆస్తులపై వాగ్వాదం జరుగుతున్న వేళ, తెలుగుదేశం ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి మాట్లాడుతూ, వైకాపా సభ్యులను ఉద్దేశించి 'కుక్క తోక వంకరలా...' అనడంతో సభలో రభస మరింత పెరిగింది. ఆపై వైకాపా సభ్యుడు కొడాలి నాని మాట్లాడుతూ, గోరంట్లను ఉద్దేశించి బురదలో దొర్లిన పందుల్లా మాట్లాడుతున్నారని అనడంతో, అధికార పార్టీ సభ్యులు తీవ్ర అభ్యంతరం లేవనెత్తారు.
ఆపై స్పీకర్ కోడెల కల్పించుకుని ఈ తరహా వ్యాఖ్యలు సరికావని వాటిని వెనక్కు తీసుకోవాలని సూచించారు. అనంతరం నాని మాట్లాడుతూ, "అధ్యక్షా... నేను వ్యక్తిగతంగా ఆయన్ను అనలేదు. ఆయన మమ్మల్ని కుక్క తోక వంకర అని అంటే, నేను... మీరు బురదలో దొర్లిన పందుల్లా వ్యవహరిస్తున్నారు అన్నాను. ఒకవేళ ఆయన బాధపడివుంటే నేను విత్ డ్రా చేసుకుంటున్నాను. ఆయన్ను కూడా విత్ డ్రా చేసుకోమనండి" అన్నారు.