: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు: ఒక చోట టీడీపీ-బీజేపీ అభ్యర్థి, మరో స్థానంలో వైసీపీ అభ్యర్థి లీడింగ్!


ఆంధ్రప్రదేశ్ లోని రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మూడో రౌండ్ ముగిసేసరికి ఒక చోట టీడీపీ-బీజేపీ అభ్యర్థి, మరో స్థానంలో వైసీపీ అభ్యర్థి ఆధిక్యంలో ఉన్నారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో టీడీపీ-బీజేపీ ఉమ్మడి అభ్యర్థి పీవీఎస్ మాధవ్ 2,633 ఓట్ల మెజారిటీతో ముందంజలో ఉన్నారు. పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో వైసీపీ అభ్యర్థి వెన్నపూస వేణుగోపాల్ రెడ్డి మూడో రౌండ్ ముగిసే సరికి 5,934 ఓట్ల ఆధిక్యంతో కొనసాగుతున్నారు.

  • Loading...

More Telugu News