: సూడాన్ లో విమానం కూలి 44 మంది దుర్మరణం
దక్షిణ సూడాన్ లో విమానం కూలింది. భారత కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 7:30 గంటల ప్రాంతంలో వావు విమానాశ్రయంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. విమానం కుప్పకూలిన సమయంలో ఈ విమానంలో కనీసం 44 మంది ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తోంది. కాగా, ఈ ఘటనలో ప్రయాణికుల క్షేమం గురించి భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. విమానంలోని 44 మంది మరణించినట్టు వార్తలు రాగా, కొన్ని వార్తా చానెళ్లు మాత్రం కొంతమంది ప్రాణాలు కోల్పోయినట్టు, పలువురు గాయపడ్డట్టు తెలిపాయి. కాగా, ఈ విమానం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తోంది? ప్రమాదానికి కారణమేంటి? అన్న వివరాలతో పాటు మరింత సమాచారం తెలియాల్సివుంది.