: ప్రభాస్ అంకిత భావం ఆశ్చర్యపరిచింది: పర్శనల్ ఫిజికల్ ట్రైనర్ లక్ష్మారెడ్డి


‘బాహుబలి’ చిత్రం కోసం తన పర్సనాలిటీని కాపాడుకునేందుకు హీరో ప్రభాస్ చూపిన అంకిత భావం తనను ఆశ్చర్యపరిచిందని బాడీ బిల్డర్ లక్ష్మారెడ్డి అన్నారు. ప్రభాస్ కు ప్రత్యేక ఫిజికల్ ట్రైనర్ గా పని చేసిన ఆయన మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ‘బాహుబలి’ చిత్రం కోసం ప్రభాస్ తీసుకునే ఆహారం, వర్కవుట్స్ అన్నీ కూడా తన పర్యవేక్షణలోనే నాలుగేళ్లపాటు జరిగాయని అన్నారు. ‘బాహుబలి 1’లో మహేంద్ర బాహుబలి పాత్ర కోసం ప్రభాస్ కు ఎగ్ వైట్స్, చికెన్, నట్స్, అల్మండ్స్, చేపలు, కూరగాయలు వంటి వాటిని ఆరు సార్లు ఆహారంగా ఇచ్చామన్నారు. ‘బాహుబలి 2’లో అమరేంద్ర బాహుబలి పాత్ర కోసం ప్రభాస్ వంద కిలోల బరువు పెరిగాడని, చీజ్, మటన్ వంటి ఆహారాన్ని ఎనిమిది సార్లు ఆయనకు అందించామని చెప్పారు.  

  • Loading...

More Telugu News