: రాంచీ టెస్టు చూడడానికి వచ్చిన ధోనీ.. అభిమానుల హర్షధ్వానాలు!
రాంచీలో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్టు చివరి రోజు ఆటను చూడడానికి టీమిండియా క్రికెటర్ ధోనీ వచ్చాడు. ఇటీవలే విజయ్ హజారే ట్రోఫీలో జార్ఖండ్ టీమ్ కు కెప్టెన్ గా ఆడిన ధోనీ.. చివరకు తమ జట్టు ఓటమిపాలవడంతో ఆయన తన సొంతూరుకు తిరిగొచ్చేశాడు. మూడో టెస్టులో ఈ రోజు ఫలితాన్ని తేల్చే రోజు కావడంతో స్టేడియానికి వచ్చి, స్పెషల్ గ్యాలరీలో కూర్చొని ఆసక్తిగా మ్యాచ్‌ను చూస్తున్నాడు. ధోనీ కనిపించగానే అందరూ ధోనీ ధోనీ అంటూ నినాదాలు చేశారు.