: వాళ్లిద్దరి మధ్య ఏం జరిగింది? బాలీవుడ్ నటుడ్ని బతిమాలుతున్న పాకిస్థాన్ సినీ నటి... వీడియో వైరల్!


బాలీవుడ్ స్టార్ రణ్ బీర్ కపూర్, పాకిస్థాన్ నటి మహీరా ఖాన్ మధ్య చోటుచేసుకున్న సన్నివేశం ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రణ్ బీర్ కపూర్ దుబాయ్ లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లాడు. ఆ సమయంలో పాకిస్థాన్ నటి మహీరా ఖాన్ కూడా ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. దీంతో వారిద్దరూ ఫొటోలకు పోజులిచ్చారు. రెడ్ కార్పెట్ పై నడిచి ఆకట్టుకున్నారు. ఇదంతా స్టేజ్ మీద చోటుచేసుకుంది. అనంతరం హోటల్ రూంలో మరో ఘటన చోటుచేసుకుంది. రణ్ బీర్ కపూర్ అసహనంతో ఉండగా మహీరా ఖాన్ అతనిని బతిమాలుతోంది. 'తప్పు జరిగిపోయింది. క్షమించమని' వేడుకుంటోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గతంలో ముగ్గురు ఖాన్ లతో నటించేది లేదని, ఇమ్రాన్ హష్మీతో లిప్ లాక్ చేస్తే కేన్సర్ వస్తుందన్న తీవ్ర వ్యాఖ్యలు మహీరా ఖాన్ చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News