: యోగి ఆదిత్యనాథ్ గోశాలలో... ఆవుల కేర్ టేకర్ ఓ ముస్లిం!
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కు గోసేవ చేయడం ఓ అలవాటు. గోరఖ్ పూర్ లోని గోరఖ్ నాథ్ మఠానికి ఆయనే మహంత్. అక్కడ రెండు ఎకరాల విస్తీర్ణంలో గోశాల ఉంది. అందులో దాదాపు 500 గోవులు ఉన్నాయి. తెల్లవారుజామున 3 గంటలకు నిద్రలేచే అలవాటు ఉన్న యోగి... యోగా, ప్రార్థన ముగించుకున్న తర్వాత గోశాలకు వెళ్లి ఆవులకు మేత వేస్తారు. ఆ తర్వాతే ఆయన అల్పాహారాన్ని తీసుకుంటారు. అయితే, ఈ గోశాలలోని ఆవులను చూసుకునే వాలంటీర్లలో ఓ ముస్లిం కూడా ఉండటం గమనార్హం. మహ్మద్ అనే యువకుడు తన చిన్నతనం నుంచే ఇక్కడే పని చేస్తున్నాడు. అతని తండ్రి ఇనాయతుల్లా కూడా ఈ గోశాలలోనే పని చేస్తుండేవాడు. ఆవులకు స్నానం చేయించడం, వాటికి దాణా వేయడం మహ్మద్ పని. అతివాద హిందూ భావజాలం ఉండే ఆదిత్యనాథ్ ఆలయానికి చెందిన సిబ్బందిలో ముస్లిం కూడా ఉండటం ఆసక్తికరమే.