: ప్రజా ప్రతినిధులను చంద్రబాబు రూ. 100 కోట్లతో కొన్నారు: భూమన


ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని వైసీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి విమర్శించారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్థానిక ప్రజా ప్రతినిధులను రూ. 100 కోట్లు ఖర్చు చేసి కొనుగోలు చేశారని... ఈ కారణంగానే అన్ని స్థానాల్లో టీడీపీ గెలుపొందిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గతంలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన చంద్రబాబు, ఇప్పుడు స్థానిక ప్రజా ప్రతినిధులను కొన్నారని ఆరోపించారు. చంద్రబాబు వ్యవహారంతో ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతోందని మండిపడ్డారు. రాష్ట్రంలో చంద్రబాబు దుష్ట పాలన కొనసాగుతోందని అన్నారు. ఆయన దురాగతాలు మరెంతో కాలం కొనసాగవని... 2019లో చంద్రబాబుకు ప్రజలు బుద్ధి చెబుతారని జోస్యం చెప్పారు. 

  • Loading...

More Telugu News