: వైసీపీ నేతల ప్రయత్నాలేవీ ఫలించలేదు: చంద్రబాబు
అమరావతిని అద్భుతంగా నిర్మించి తాము చరిత్రను తిరగ రాయబోతున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ రోజు ఆయన శాసనసభలో మాట్లాడుతూ.. అమరావతికి వాస్తుబలం కూడా ఉందని అన్నారు. వైసీపీ నేతలు రైతులను రెచ్చగొట్టాలని చూశారని, అయినప్పటికీ వారి ప్రయత్నాలు ఏవీ ఫలించలేదని అన్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా అభివృద్ధిని ఆపబోమని అన్నారు. తనకు కమాండ్ అనేది ఏదీ లేదని అన్నారు. రాజశేఖర్‌రెడ్డికి ఢిల్లీ హై కమాండ్ గా ఉండేది కానీ, తనకు మాత్రం ప్రజలే హై కమాండ్ అని అన్నారు. ప్రజలు అభిమానించే నాయకుల్లా నాయకులు కనిపించాలని ఆయన హితవు పలికారు. రాష్ట్రాభివృద్ధి కోసమే పాటు పడుతున్న తమకు వైసీపీ నేతలు అడ్డంకుటు సృష్టిస్తున్నారని చెప్పారు. రాష్ట్ర విభజన ప్రభావం ఆంధ్రప్రదేశ్ పై ఎంతో పడిందని, వాటన్నింటినీ సమర్థవంతంగా ఎదుర్కుంటూ ముందుకు వెళుతున్నామని చెప్పారు.