: వాకాటి, ఆనం... ఎవరికి ఎన్ని ఓట్లంటే..!
నెల్లూరు స్థానిక సంస్థల కోటాలో తెలుగుదేశం అభ్యర్థి వాకాటి నారాయణరెడ్డి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. మొత్తం 852 ఓట్లు ఉన్న నియోజకవర్గంలో 851 ఓట్లు పోల్ అయ్యాయి. వీటిల్లో టీడీపీ అభ్యర్థి వాకాటికి 462, వైకాపా అభ్యర్థి ఆనం విజయకుమార్ రెడ్డికి 377 ఓట్లు పోల్ కాగా, మరో 2 ఓట్లు చెల్లలేదు. దీంతో 85 ఓట్ల మెజారిటీతో వాకాటి విజయం సాధించారని అధికారులు తెలిపారు. వాకాటి విజయంతో తెలుగుదేశం శ్రేణులు సంబరాలకు దిగాయి.