: మంత్రిని చేస్తున్నారంటే కొంచెం కంగారుగా ఉంది: నారా లోకేశ్
తాను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయి రెండేళ్లు అయిందని, ఇప్పుడు ఎమ్మెల్సీని చేశారని, రేపు మంత్రిని చేస్తున్నారంటే కొంచెం కంగారుగా ఉందని నారా లోకేశ్ అన్నారు. ఒక న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘ధైర్యం ఉంది. భయం కూడా ఉంది. ఆ పదవికి న్యాయం చేయాలి కదా! ఇప్పుడు టీడీపీ ప్రధాన కార్యదర్శి పదవికి న్యాయం చేయాలంటేనే చాలా కష్టపడుతున్నాను. మంత్రి పదవికి న్యాయం చేయాలంటే దానికి తగిన శ్రమ పడాలి, ఫ్యామిలీ కోఆర్డినేషన్ చేయాలి.. మా అబ్బాయికి రెండేళ్లు. అది మరీ, బిగ్గెస్ట్ ఛాలెంజ్. మా నాన్న ఫోకస్ అంతా మనవడి మీదే ఉంది. నేను చిన్నప్పుడు ఏ స్కూల్ కు వెళుతోంది.. ఏం చదువుతోంది .. నాన్న అసలు పట్టించుకోలేదు. నాన్న ఎఫర్ట్ జీరో. అంతా అమ్మే. నా కొడుకు విషయానికి వచ్చే సరికి మా నాన్న ఎఫర్ట్ బాగా ఉంటోంది’ అని చెప్పుకొచ్చారు.