: ఉత్తరప్రదేశ్ ప్రజలకు ఇది చారిత్రకమైన రోజు: సీఎం యోగి ఆదిత్యనాథ్
ఉత్తరప్రదేశ్ ప్రజలకు ఇది చారిత్రకమైన రోజు అని కొత్త సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. యూపీ అభివృద్ధే ధ్యేయంగా కలసికట్టుగా పనిచేస్తామని, అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యమని, దీనదయాళ్ ఉపాధ్యాయ ఆశయాలను సాధిస్తామని, అనినీతి ప్రభుత్వాలతో యూపీ కష్టాలను ఎదుర్కొందని, పేదలు, దళితులు, పీడితుల అభ్యన్నతి కోసం కృషి చేస్తామని అన్నారు. రైతులు, వ్యవసాయానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామని, నిరుద్యోగ యువత కోసం కొత్త ఉద్యోగాలను సృష్టిస్తామని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కచ్చితంగా అమలు చేస్తామని యోగి ఆదిత్యనాథ్ స్పష్టం చేశారు.