: యూపీ కొత్త సీఎంగా యోగి ఆదిత్యనాథ్ ప్రమాణ స్వీకారం


ఉత్తరప్రదేశ్ 21వ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం, వేదికపై ఉన్న ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, యూపీ గవర్నర్ తో కరచాలనం చేయడంతో ఆయనకు అభినందనలు తెలిపారు. అనంతరం, ఉపముఖ్యమంత్రిగా కేశవ ప్రసాద్ మౌర్య, డాక్టర్ దినేశ్ శర్మ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి బీజేపీ సీనియర్ నేత ఎల్. కె అద్వానీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర మంత్రులు, సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్, మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు.

  • Loading...

More Telugu News