: నా పై జోక్స్ రాకపోతే బాధపడతా: నటి ఆలియాభట్
సామాజిక మాధ్యమాల్లో తనపై జోక్స్ రాకపోతేనే తాను బాధపడతానని అంటోంది బాలీవుడ్ ప్రముఖ నటి ఆలియాభట్. తనపై వచ్చే జోక్ లకు స్పందించడమే కాదు, అలాంటి జోక్స్ రాని రోజున చాలా బాధపడతానని చెప్పింది. తనపై జోక్స్ వేస్తున్నారని చెప్పి తానేమీ బాధపడనని, ఈ సందర్భంగా తన తండ్రి మహేశ్ భట్ చెప్పిన మాటలను ఆమె గుర్తు చేసుకున్నారు. ‘రోజు పూచే పూలు ఏ ఒక్కరోజు పూయకపోయినా బాధ కలుగుతుంది’ అని తన తండ్రి చెబుతుంటారని, అలాగే ‘జోక్స్ కూడా ఏ ఒక్కరోజు రాకపోయినా నాకు బాధ కలుగుతుంది’ అని ఆలియా భట్ చెప్పుకొచ్చింది. తనకు తెలివిగల దానిలా కనిపించడం కన్నా, ఏదీ తెలియని దానిలా ఉండటమంటేనే ఇష్టమని ఆలియాభట్ చెప్పింది.