: వీడితో ఇంకో పాతికేళ్లయినా గడపాలి... అందుకే మందు, సిగరెట్ మానేస్తా: షారూక్ ఖాన్


తన పెద్ద కుమారుడు, కుమార్తెలతో గడిపినంత సమయాన్ని చిన్నబ్బాయి అబ్రామ్ తోనూ గడపాలని గట్టిగా కోరుకుంటున్న బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్, ఆ పిల్లాడి కోసం మద్యం, సిగరెట్లు మానేయాలని భావిస్తున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించిన షారూక్, తన ఆరోగ్యం గురించి తొలుత ఆలోచించాల్సి వుందని, అబ్రామ్ తో ఇంకో పాతికేళ్లయినా గడపాలని భావిస్తున్నానని, అందుకోసం చెడు అలవాట్లు వదిలేసి, నిత్యమూ వ్యాయామం చేయనున్నానని చెప్పాడు. పెద్ద బిడ్డలతో గడిపినంత సమయాన్ని చిన్నోడితోనూ గడుపుతానో లేదోనన్న భయంగా ఉందని అన్నాడు. అబ్రామ్ అంటే తనకెంతో ఇష్టమని చెప్పాడు.

  • Loading...

More Telugu News