: మోదీ నిర్ణయంతో ఎంతమాత్రమూ ఆశ్చర్యం కలుగలేదు: ఒవైసీ ఘాటు వ్యాఖ్య


యూపీకి ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ ను ఎంచుకుంటూ ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయం తనకు ఎంతమాత్రమూ ఆశ్చర్యం కలిగించలేదని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన, ప్రధాని మోదీ చెప్పుకునే 'నయా భారత్' విజన్ లో భాగంగానే ఇలా జరిగిందని, హిందూ, ముస్లిం సమ్మేళనంగా నిలిచిన భారత సంస్కృతిపై ఇది దాడేనని ఆయన అభివర్ణించారు. సమాజ్ వాదీ సైతం ముస్లింలను వంచించిందని, ఇక ఇప్పుడు పరిమితవాద అభివృద్ధి కళ్లకు కనిపించనుందని వ్యాఖ్యానించిన ఆయన, బీజేపీ చెప్పే ప్రగతి ఇదేనని అన్నారు. ఆయన 'గంగా యమునా తెహజీబ్'పై దాడికి తెగబడ్డారని మండిపడ్డారు.

  • Loading...

More Telugu News