: 50 కోట్ల యాహూ కస్టమర్ల వివరాలను దొంగిలించిన హ్యాకర్ ఓ బ్యాంకు ఉద్యోగి!


ఇంటర్నెట్ దిగ్గజం యాహూలో కస్టమర్లుగా ఉన్న 50 కోట్ల మంది వ్యక్తిగత వివరాలను దొంగించిన వ్యక్తి, ఓ బ్యాంకు ఉద్యోగని వెల్లడైంది. రష్యన్ ఫెడరల్ ఏజంట్ గా పని చేస్తూ, పైకి బ్యాంకులో ఉద్యోగం చేసుకుంటున్న ఇగొర్ సుష్ సిన్ అనే వ్యక్తి మొత్తం సమాచారాన్ని హ్యాక్ చేసినట్టు రష్యన్ బిజినెస్ మేగజైన్ 'కొమ్మెర్ సాంట్' పేర్కొంది. బిజినెస్ లీడర్ మిఖాయిల్ ప్రోఖొరొవ్ నిర్వహిస్తున్న రినైసెన్స్ బ్యాంకులో సెక్యూరిటీ డైరెక్టరుగా సుష్ సిన్ పని చేస్తున్నాడని తెలిపింది. కాగా, హ్యాకింగ్ కేసులో నిందితుడిగా పేరు రావడానికి ఒక రోజు ముందే, తన పదవీ కాలాన్ని ముగించుకున్న సుష్ సిన్ బ్యాంకును వీడి వెళ్లారని తెలుస్తోంది. ఈ విషయమై స్పందించేందుకు రినైసెన్స్ బ్యాంకు నిరాకరించింది.

  • Loading...

More Telugu News