: సీఎం పీఠం ఎక్కకుండానే తొలి ఆదేశాలు ఇచ్చిన ఆదిత్యనాథ్!


హిందూ అతివాద నేతగా ముద్రపడ్డా, సంఘ్ పరివార్, బీజేపీ అండతో, నేడు ఉత్తరప్రదేశ్ సీఎం పీఠంపై కూర్చోనున్న యోగి ఆదిత్యనాథ్ తన తొలి ఆదేశాలను ఇచ్చారు. ఉత్సవాలు జరుపుకునే పేరిట ఎవరూ ప్రజలకు ఇబ్బందులు కలిగించే చర్యలను, సాధారణ జన జీవనానికి ఆటంకాలు కలిగించే పనులనూ చేయరాదని ఆయన ఆదేశించారు. తన ప్రమాణ స్వీకారం నేపథ్యంలో సీఎస్ రాహుల్ భట్నాగర్, డీజీపీ జావేద్ అహ్మద్ సహా, ఇతర ఉన్నతాధికారులతో వీవీఐపీ గెస్ట్ హౌస్ లో సమావేశమైన ఆయన, ఈ మేరకు అన్ని చర్యలనూ తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, బీజేపీ కార్యకర్తలైనా, శాంతికి విఘాతం కలిగిస్తే, కఠినంగా వ్యవహరించాలని ఆయన ఆదేశించారు. కాగా, యూపీలో బీజేపీ విజయం తరువాత, ఓ ప్రార్థనాలయంపై హిందూ జెండాను ఎగర వేసేందుకు కొందరు ప్రయత్నించడంతో, ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News