: డబ్బుంటే ప్రాణం నిలబెట్టండి: సల్మాన్
మీ దగ్గర ధనం ఉంటే మరొకరి ప్రాణాలను రక్షించడానికి వినియోగించండని సల్మాన్ ఖాన్ సూచించాడు. ప్రజలు దాతృత్వం చూపాలని కోరాడు. సల్మాన్ ఖాన్ కు చెందిన బీయింగ్ హ్యూమన్ స్వచ్ఛంద సంస్థ ఫోర్టిస్ హెల్త్ ఫౌండేషన్ తో చేయి కలిపింది. గుండె సంబంధిత లోపాలతో పుట్టే చిన్నారులకు ఇందులో భాగంగా ఉచిత చికిత్సలు అందిస్తారు. ఇందుకు కావాల్సిన నిధులను బీయింగ్ హ్యూమన్ అందిస్తుంది. తాను చేస్తున్నది సముద్రంలో నీటిబొట్టంతేనని సల్మాన్ వినయంగా చెప్పాడు.