: షాద్ నగర్ లో అగ్ని ప్రమాదం.... 300 బైకులు దగ్థం


రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో దారుణం చోటుచేసుకుంది. షాద్ నగర్ లోని టీఎస్ ఆర్టీసీ బస్టాండ్ లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. ఈ మంటలు బైక్ పార్కింగ్ షెడ్డుకు అంటుకున్నాయి. దీంతో అక్కడ పార్కింగ్ చేసిన సుమారు 300 ద్విచక్రవాహనాలు అంటుకుపోయాయి. సకాలంలో అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలికి చేరుకున్నప్పటికీ వాహనాల ట్యాంకుల్లోని ఇంధనం ఆగకుండా మండడంతో భారీ ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. దీంతో మంటలు ఆర్పేందుకు చాలా సమయం పట్టింది. ఈ క్రమంలో 200 వాహనాలు పూర్తిగా కాలి బూడిద కాగా, మరో వంద బైకులు పాక్షికంగా దగ్ధమయ్యాయి. 

  • Loading...

More Telugu News