: నేను కళ్ల డాక్టర్ ను కాదే...పవన్ కల్యాణ్ కళ్లలోకి ఎలా చూస్తాను?: నవ్వించిన యాంకర్ సుమ


కాటమరాయుడు ప్రీ రిలీజ్ ఫంక్షన్ కారణంగా హైదరాబాదులోని శిల్పకళా వేదిక పరిసరాలన్నీ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ తో నిండిపోయాయి. ఈ నేఫథ్యంలో పవన్ కల్యాణ్ కు, 'కాటమరాయుడు'కు జై కొడుతూ నినాదాలు హోరెత్తుతున్నాయి. ఈ సందర్భంగా టీవీ యాంకర్  ఒకరు మరో యాంకర్ సుమను ఉద్దేశించి, 'పవన్ కల్యాణ్ ను మీరు ప్రత్యక్షంగా చూస్తారు కదా? అయన ఎలా వ్యవహరిస్తారు?' అంటూ ప్రశ్నించారు.

దానికి సమాధానంగా 'ఆయన ఏదైనా ఉన్నది ఉన్నట్టు ముఖం మీద చెప్పేస్తారు' అంది సుమ. 'ఆయన సూటిగా చూస్తారా? మీరెప్పుడైనా ఆయన కళ్లలోకి సూటిగా చూశారా?' అని ప్రశ్నించగా, అలా చూడడానికి తానేమీ కళ్ల డాక్టర్ ను కాదని చెప్పింది. దీంతో అంతా నవ్వేశారు. ఆ వెంటనే పక్కనే ఉన్న యాంకర్ రవిని కళ్లు చూపించమని, ఆయన కళ్ళలోకి చూసి, 'నీకు పచ్చకామెర్లు లేవు' అంది. దీంతో మరోసారి అక్కడ నవ్వులు పూశాయి.

తర్వాత పెద్దగా గోల చేస్తున్న మెగా అభిమానులను ఉద్దేశించి 'పవన్ కల్యాణ్ సినిమాకు సంబంధించిన కార్యక్రమం అంటే ముందు ఒక ఐదు నిమిషాల పాటు ఒక హోరు వినిపిస్తుందని, ఆ తరువాత పవన్ కల్యాణ్ వచ్చే సమయంలో ఒక ఐదు నిమిషాలు, పవన్ కల్యాణ్ పేరు ఎత్తగానే మరో ఐదు నిమిషాలు ఒకేలా హోరు, జోరు వినిపిస్తాయని' సుమ చెప్పింది. దీంతో అభిమానులు మరింతగా రెచ్చిపోయి అరుపుల హోరు పెంచారు. 

  • Loading...

More Telugu News